ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై వెస్టిండీస్‌తో 2 టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తొలిసారి సొంతగడ్డపై జట్టును నడిపించనున్నాడు.