ATP: దసరా పండుగ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీ వేదమాత గాయత్రీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు జేసీ దంపతులను ఆశీర్వదించారు. తర్వాత వేద పండితులందరినీ ప్రభాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు.