ATP: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త అత్యంత బాధాకరమని, అతని పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గతంలో ఇరువురం మంత్రిగా పనిచేశామని గుర్తు చేసుకున్నారు.