‘OG’ సక్సెస్ మీట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నవ్వులు పూయించారు. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్కు కటానా పట్టుకురావాలని సుజీత్, తమన్ కోరారు. నా జీవితంలో అలా ఎప్పుడూ చేయలేదు. అందరూ నాతో ఆడుకుంటున్నారని తెలుసు. ఈ వేడుకకు బ్లాక్ డ్రస్, కళ్లజోడు, తుపాకీ పట్టుకుని రావాలన్నారు. గన్ నా వీక్నెస్ అని తెలుసుకుని ఆడుకుంటున్నారు’ అని సరదాగా పేర్కొన్నారు.