ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు బుధవారం రాయదుర్గం పట్టణంలోని శ్రీనివాస వీడియో హౌస్, హొండా షోరూమ్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ స్లాబ్ కుదింపుతో టీవీలు, ఫ్రిజ్, ఏసీలు, వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, నిత్యవసర వస్తువుల ధరల్లో భారీ తగ్గుదల వచ్చిందని తెలిపారు. దీంతో ప్రజలకు ఏడాదికి వేల కోట్ల ఆదా అవుతోందని అన్నారు.