PPM: మున్సిపల్ శాఖలోని ఔట్సోర్సింగ్ నాన్-పీహెచ్ వర్కర్ల జీతాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులకు రూ.3500 చొప్పున వేతనం పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడు ఫోటోకి ఫాలో అభిషేకం చేశారు. అలాగే MLAకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.