E.G: గొల్లప్రోలు–రావికంపాడు రైల్వే స్టేషన్ల మధ్య డౌన్ లైన్ ట్రాక్ పక్కన దుర్ఘటన జరిగింది. గుర్తు తెలియని (45) వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయంతో పాటు, కాలు విరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు ఎవరనేది తెలియ రాలేదని, మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు.