TG: తెల్లారితే దసరా.. కానీ, గాంధీ జయంతి కూడా కావడంతో ముందుగానే మందుబాబులు వైన్ షాపులకు పోటెత్తారు. రాత్రి 11 దాటితే చుక్క దొరకడం కష్టమవుతుందని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. అలాగే, రేపు మాంసం దుకాణాలూ బంద్ కానుండటంతో.. ఇవాళ మాంసం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.