VZM: గాంధీ జయంతి సందర్భంగా గురువారం నెల్లిమర్లలో మాంసాహార విక్రయాలు నిషధిస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ టి.జయరాం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లలో చేపలు, మాంసం, గుడ్లు, తదితర మాంసాహారం విక్రయించకూడదని ఆదేశించారు. చికెన్, మటన్, చేపల దుకాణాలు తెరవవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.