»Good News For Whatsapp Users Link To 4 Phones At Once Feature
WhatsApp: యూజర్లకు గుడ్ న్యూస్..ఒకేసారి 4 ఫోన్లకు లింక్
వాట్సాప్(WhatsApp) వినియోగదారులకు మంచి అప్ డేట్ వచ్చేసింది. ఎందుకంటే ఇక నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. నిన్న సాయంత్రం వాట్సాప్ సంస్థ ఈ మేరకు ప్రకటించింది.
WhatsApp యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై మీరు నాలుగు ఫోన్లలో ఒకే వాట్సాప్ ఖాతాలోకి లాగిన్ కావచ్చు. ఒకే వాట్సాప్ ఖాతాతో బహుళ మొబైల్ ఫోన్లను రన్ చేసే అవకాశాన్ని ప్రవేశపెడుతున్నట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మంగళవారం రాత్రి ప్రకటించింది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ ఫీచర్ ను ప్రేవేశపెట్టినట్లు చెప్పారు. రాబోయే కొన్ని వారాల్లో ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ తెలిపింది. ఇప్పటి వరకు వినియోగదారులు ఒక ఫోన్, సహచర డెస్క్‌టాప్ పరికరాలలో ఒక WhatsApp ఖాతాను మాత్రమే ఉపయోగించే అవకాశం ఉండేది. ఈ కొత్త సౌకర్యం ద్వారా మరో నాలుగు స్మార్ట్ఫోన్లు లేదా నాలుగు PCలలో వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు.
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫీచర్ లభ్యత గురించి ఈ మేరకు ప్రకటించారు. ఈరోజు నుంచి మీరు గరిష్టంగా నాలుగు ఫోన్లలో ఒకే WhatsApp ఖాతాలోకి లాగిన్ చేయవచ్చని పేర్కొన్నారు.
వినియోగదారులు వాట్సాప్‌ని నాలుగు పరికరాల్లో లింక్ చేసుకోవచ్చు. ప్రాథమిక పరికరంలో నెట్వర్క్ అందుబాటులో లేనప్పటికీ అవన్నీ స్వతంత్రంగా పని చేస్తాయి. WhatsApp ఖాతా లింక్ చేయబడిన ఇతర పరికరాలు మెసేజ్‌లు రావడం సాధారణంగా కొనసాగుతుంది. అయితే వాట్సాప్ ఇన్స్టాల్ చేయబడిన ప్రాథమిక పరికరం ఎక్కువ కాలం నిష్క్రియంగా ఉంటే, వినియోగదారు అన్ని ఇతర పరికరాల నుంచి లాగ్ అవుట్ చేయబడతారు.
గత సంవత్సరం మేము గోప్యత, భద్రతను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అన్ని పరికరాలలో సులభమైన సందేశాలను పరిచయం చేశామని పేర్కొన్నారు. ఈ రోజు మేము మా మల్టీ డివైజ్ WhatsApp అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళుతున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఫోన్‌ని లింక్ చేయబడిన పరికరంగా చేయడం వలన సందేశాలను పంపడం సులభం అవుతుంది. దీంతో వినియోగదారులు సైన్ అవుట్ చేయకుండానే మొబైల్ ఫోన్ల మధ్య మారవచ్చు. వారి చాట్‌లో వారు ఎక్కడ వదిలిపెట్టారో అక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. మీది చిన్న వ్యాపారం అయితే, ఇతర ఉద్యోగులు అదే WhatsApp వ్యాపార ఖాతాతో వారి మొబైల్ ఫోన్ల నుంచి నేరుగా కస్టమర్లకు ప్రతిస్పందించవచ్చు.
అలాగే రాబోయే వారాల్లో మేము లింక్ చేయబడిన పరికరాలను ఒకదానితో ఒకటి లింక్ చేయడానికి ప్రత్యామ్నాయ సులభమైన మార్గాన్ని రూపొందిస్తున్నామని వాట్సాప్ వెల్లడించింది. మీరు ఇప్పుడు WhatsApp వెబ్‌లో మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఒక వినియోగ కోడ్‌ను పొందవచ్చు. దాన్ని మీరు లింక్ చేయడానికి ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో మరిన్ని లింక్ చేయబడిన పరికరాల కోసం మేము ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తెస్తామని కంపెనీ వెల్లడించింది.