ప్రముఖ ఇన్స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) తమ యూజర్ల(Users)కు గుడ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల కోసం ఈ యాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. అందులో భాగంగా త్వరలోనే సరికొత్త ఫీచర్(New Feature)ను యూజర్లకు పరిచయం చేయనుంది. వాట్సాప్(WhatsApp)లోనే తమకు నచ్చినట్లుగా ఫోటోలను క్రాప్(Crop) చేసుకునేలా అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ టూల్(Tool)ను మెగా యాజమాన్యంలోని కంపెనీ అభివృద్ధి చేస్తోంది.
క్రాప్ ఫీచర్(Crop Feature) గురించి వాబీటాఇన్ఫో(WABetaInfo) వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్ లల్లో ఇష్టం వచ్చిన రీతిలో క్రాప్ చేసుకోని సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు అలా కాకుండా నేరుగానే వాట్సాప్‌లోనే ఫోటోలను క్రాప్ చేసుకునే వీలుంటుంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని వాబీటాఇన్ఫో(WABetaInfo) తెలియజేసింది.
వాట్సాప్(WhatsApp)ను ఓపెన్ చేయగానే ముందుగా క్రాప్ చేయాల్సిన ఫోటోను ఎంచుకోవాలి. ఆ ఫోటో పై భాగంపై కనిపించే ఐకాన్స్ లో క్రాప్ ఆప్షన్ (Crop Option) పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటోను నచ్చిన విధంగా క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేశాక ఆ ఇమేజ్ ను ఇతరులకు ఫార్వార్డ్ చేసుకోవచ్చు. దీని వల్ల టైమ్ ఆదా అవుతుంది. అంతేకాకుండా ఇమేజ్ (Image)ను క్రాప్ చేసుకునేందుకు ఇంకో టూల్ ను కూడా వాడాల్సిన పని ఉండదు. త్వరలోనే ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లందరికీ(WhatsApp Users) అందుబాటులోకి రానుంది.