యాపిల్ కంపెనీ(Apple Company) ఐఫోన్ 14 సిరీస్(iPhone 14 series)లో స్మార్ట్ ఫోన్లను గత ఏడాది విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఇప్పుడు ఐఫోన్ 15(iPhone 15) సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇండియాలో ఐఫోన్ 14 ధర రూ.80 వేల నుంచి మొదలవుతుంది. స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి వాటి ధర రూ.1 లక్ష వరకూ ఉంటుంది. అయితే ఇంత విలువైన ఐఫోన్14 ధర ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో రూ.30 వేలకే సొంతం అవుతోంది. ఐఫోన్ కొనాలనుకునేవారికి ఇదొక అద్భుతమైన ఆఫర్(Offer).
అదిరిపోయే డిస్కౌంట్స్(Discounts) ఆఫర్‌తో ఫ్లిప్‌కార్ట్(Flipkart) ఈ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్(Mobiles Bhonanja Sale) నడుస్తోంది. ఈ స్పెషల్ ఆఫర్లలో యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) 128GB వేరియంట్ ధరను కంపెనీ రూ.67,999కి తగ్గిస్తూ బంపరాఫర్‌ను ప్రకటించింది. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు అయితే మరో రూ.4,000 వరకూ క్యాష్ బ్యాక్(cashback) లభిస్తుంది. దీంతో వారు ఐఫోన్ 14ను రూ.63,999కే కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 14(iPhone 14)పై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ.33,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. వర్కింగ్ కండిషన్ బాగుండే టాప్ బ్రాండ్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఫ్లిప్‌కార్ట్(Flipkart) డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు(Exchange Offers) అన్ని కలిపితే ఐఫోన్ 14 కొనుగోలుపై రూ.30,999 తగ్గుతుంది.
ఇకపోతే యాపిల్ ఐఫోన్ 14(Apple iPhone 14 features) ఫీచర్లు చూసుకుంటే.. ఇది 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో ఉంటుంది. సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది. ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్స్ రిజల్యూషన్ ఇస్తుంది. యాపిల్ ఐఫోన్ 14లో రియర్ డ్యుయల్ కెమెరా సెటప్ కూడా ఉంది. వెనకవైపు 12MP ప్రైమరీ సెన్సార్, అలాగే 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా ఉండటమే కాకుండా డివైజ్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. A15 బయోనిక్ చిప్సెట్తో ఐఫోన్ 14 మిడ్నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్, బ్లూ కలర్ వేరియంట్లలో ఐఫోన్ 14 లభిస్తుంది. ఈ మధ్యనే ఎల్లో కలర్లో కూడా ఈ వేరియంట్ లభిస్తోంది.