»Nasscom Appoints Microsoft India President Anant Maheshwari As Chairperson
Nasscom Chairperson: నాస్కామ్ కొత్త చైర్‌పర్సన్‌గా అనంత్ మహేశ్వరి
2023-24కి గాను నాస్కామ్(Nasscom)కు కొత్త ఛైర్‌పర్సన్‌గా అనంత్ మహేశ్వరి(Anant Maheshwari) ఎంపికయ్యారు. అయితే అనంత్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా చేస్తుండటం విశేషం. మరోవైపు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్‌ను అదే సమయ వ్యవధిలో వైస్ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు నాస్కామ్ ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న అనంత్ మహేశ్వరిని(Anant Maheshwari) 2023-24కి చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు నాస్కామ్(Nasscom) ప్రకటించింది. మహేశ్వరి గతంలో వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న పాత్ర నుంచి కొత్తగా ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో బిజినెస్ అండ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ అయిన కృష్ణన్ రామానుజం తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు.
టెక్ సర్వీసెస్‌లో ప్రధాన సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి విస్తృత సాంకేతిక నాయకత్వాన్ని ప్రదర్శిస్తోందని నాస్కామ్ చైర్పర్సన్ అనంత్ మహేశ్వరి అన్నారు. ఇండియాలో ఐటీ క్లిష్టమైన సమయంలో ఉన్న వేళ నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు ఛైర్‌పర్సన్‌గా ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రపంచానికి విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా భారతదేశాన్ని ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
అంతేకాకుండా నాస్కామ్ 2023-24కి వైస్ చైర్‌పర్సన్‌గా కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, MD రాజేష్ నంబియార్‌ను నియమించినట్లు కూడా ప్రకటించింది. కంపెనీ తన కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను 2023-2025కి ప్రకటించింది. జాబితాలో మూడో వంతు మహిళా నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.