ప్రకాశం: గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామానికి చెందిన 40 కుటుంబాలు సోమవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారిని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అందుకే ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని అన్నారు.