MNCL: బెల్లంపల్లిలోని దుర్గాదేవి అమ్మవారి మండపాలను MLA గడ్డం వినోద్ ఆదివారం సందర్శించారు. అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పోచమ్మ చెరువు వద్ద జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రమేష్తో కలిసి పరిశీలించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.