TG: గతంలో రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తుల నుంచి మంచి విషయాలను నేర్చుకోవాలని CM రేవంత్ అన్నారు. చంద్రబాబు, YSR లాంటి నాయకులు భవిష్యత్ తరాల గురించి ఆలోచించారు కాబట్టే HYDలో హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ORR వంటి ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. తనకు కూడా పదేళ్ల సమయం ఇస్తే న్యూయార్క్‌ను మించిపోయే నగరాన్ని నిర్మించి చూపిస్తానని పేర్కొన్నారు.