టీవీకే పార్టీ తరపున మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. తొక్కిసలాటకు పోలీసుల లాఠీఛార్జ్ కారణమని టీవీకే ఆరోపిస్తుంది. కాగా కరూర్ తొక్కిసలాట ఘటనలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే.