GNTR: పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఆదివారం జరిగిన ఈ శిబిరాన్ని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ శిబిరం లక్ష్యమన్నారు.