కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర లో తన యాత్ర కొనసాగిస్తున్నారు. అయితే… ఈ యాత్రలో ఈ రోజు ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రలో.. మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా అడుగులు వేయడం విశేషం. ఈ సంఘటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక్కడ రాహుల్ గాంధీ… నెహ్రూ ముని మనవడు కాగా.. తుషార్ గాంధీ.. మహాత్మా గాంధీ ముని మనవడు కావడం విశేషం. వీరిద్దరూ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి శ్రమించారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ… రాహుల్ యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం చారిత్రాత్మకమని తెలిపింది. గాంధీ, నెహ్రూల ముని మనవళ్లు కలిసి నడవడం అద్భుతమని చెప్పింది. వీరిద్దరూ ఇద్దరు దివంగత నాయకుల వారసత్వాన్ని కొనసాగించే మహోన్నత వ్యక్తులుగా అభివర్ణించింది.