NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ 132వ జయంతి, గుర్రం జాషువా 130వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ముందుండి పోరాడిన గొప్ప నాయకులని అన్నారు.