W.G: భీమడోలు మండలం గుండుగొలనులో ఇవాళ పలు అభివృద్ధి పనులకు ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. బీసీ కాలనీలో 70 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల పనులకు, హౌసింగ్ కాలనీలో 45 లక్షలతో నిర్మించబోయే మెటల్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.