బేతంచెర్ల మండలంలో అనాథ మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాటైన వైకుంఠ సేవా సమితికి సీఐ డి. వెంకటేశ్వరరావు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. సమాజ సేవలో భాగమై ముందుకు సాగాలని సమితి సభ్యులకు హితవు పలికారు. సమాజం కోసం చేసే ప్రతి సేవా కార్యక్రమానికి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.