GNTR: విజయవాడ, గుంటూరులో అతిసారం, కలరా వ్యాప్తి చెందుతున్న క్రమంలో నీరు, ఆహార నమూనాల పరీక్షలకు కేంద్రంగా గుంటూరు వైద్య కళాశాలలోని ప్రాంతీయ ల్యాబ్ పనిచేస్తోంది. సాధారణంగా నెలకు 400-500నమూనాలు పరీక్షిస్తే, ఇటీవలి 10రోజుల్లోనే 1,300కి చేరాయి. గ్రామీణ నీటి సరఫరా నుంచి 423నమూనాలు రాగా, 140ఇప్పటికే పరిశీలించారు. బృందం రాత్రింబగళ్లు పరీక్షలు చేస్తోంది.