GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి జూబేర్ అహ్మద్ ఆదివారం తెలిపారు. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 39 గేట్లను ఎత్తివేసి, దిగువన శ్రీశైలానికి 4.94 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.