»Chennai Hat Trick In Eden Solid Victory Over Kolkata
Iden gardens : ఈడెన్‌లో చెన్నై హ్యాట్రిక్…కోల్‌కతాపై ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు కోల్ కతనెట్ రైడర్స్‌ను దాని సొంతగడ్డపైనే ఓడించింది. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈడెన్ గార్డెన్స్(Iden gardens) లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ (Rinku Singh) 53 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. అంతకుముందు, జాసన్ రాయ్ (Jason Roy) 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. రాయ్ మరికాసేపు క్రీజులో ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది. తీక్షణ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రాయ్ ఆ తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు.
కోల్ కతా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఎన్ జగదీశన్ (1), సునీల్ నరైన్ (Sunil Narine) (0) దారుణంగా విఫలమయ్యారు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) 20, కెప్టెన్ నితీశ్ రాణా 27 పరుగులతో ఫర్వాలేదనిపించారు. పవర్ హిట్టింగ్ చేస్తాడుకున్న ఆండ్రీ రస్సెల్ ఒక సిక్స్ బాది అంతటితో సరిపెట్టుకున్నాడు. రస్సెల్ 9 పరుగులు చేసి పతిరణ బౌలింగ్ లో అవుటయ్యాడు. చివరి 5 ఓవర్లలో కోల్ కతా జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోగా, సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్(Rinku Singh) క్రీజులో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రింకూ సింగ్ ఓ సిక్స్ కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడం ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ విషయం.ఏడు మ్యాచ్‌ల్లో అయిదో విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి.