అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ CM KCR) అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంటలపై అధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో అకాల వర్షాలపై అధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) సమీక్ష నిర్వహించారు. కరీంనగర్(Karimnagar), చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి(Secretary Shanti Kumari)కి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటల(crops)కు సంబంధించిన నివేదికలు తెప్పించాలని సూచించారు.కొన్ని రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. చేతికి అంది వచ్చిన పంటను కోల్పోయిన రైతులు (Farmers) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Govt) ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అకాల వర్షాల వలన కలిగిన పంట నష్టానికి సంబంధించిన నివేదికలను తెప్పించాలని సీఎం కేసీఆర్ ప్రధాన కార్యదర్శికి సూచించారు.