ATP: అనంతపురం రెవెన్యూ కాలనీ సద్భావన చిల్డ్రన్స్ పార్క్లో “స్వస్థ్ నారి- సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బోనాల మారుతి గోవింద ప్రసాద్ అధ్యక్షతన ఈ శిబిరం జరిగింది. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.