ప్రజల అస్తిత్వానికి సుస్థిర కోటను నిర్శించేది మాతృభాషేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేళ విషెస్ చెప్పిన ఆయన.. భవిష్యత్ తరాలు ‘నీవెవరు’ అని అడిగితే చెప్పడానికి సమాధానం భాష, సంస్కృతులేనన్నారు. మన తెలుగును మనం కాకపోతే ఎవరు గుర్తించి కాపాడుకుంటారని ప్రశ్నించారు. మాతృభాషపై పేరెంట్స్ మమకారం పెంచుకుని, పిల్లలకు నేర్పించాలని సూచించారు.