»The Maid With The Help Of Her Husband And Son Extorts The Old Mistress For Money In Malad
Tragedy : అనాథ అని జాలిపడితే.. అక్కున చేర్చుకున్న వాళ్లను అంతం చేసింది
రైల్వే స్టేషన్లో(Railway Station) అడుక్కు తింటున్న ఓ మహిళను తీసుకువచ్చి పెంచి పెద్దచేసి పెళ్లి చేస్తే యజమానురాలినే అంతం చేసింది. షబ్నం అనే మహిళ 25 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్లో భిక్షాటన(Begging) చేసేది. మేరీ సిలిన్ విల్ఫ్రెడ్ డికోస్టా అనే మహిళ ప్రతిరోజు రైల్వే స్టేషన్ కు వెళ్లేది. అక్కడ వికలాంగురాలైన షబ్నం(shabnam) ను చూసి జాలిపడి ఇంటికి తీసుకొని వచ్చి పని కల్పించింది. 25ఏళ్లుగా సొంత మనిషిలా చూసుకుని పెంచి పెద్దచేసి పెళ్లి చేసింది.
Tragedy : ముంబై శివారులోని మలాద్(Malad)లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైల్వే స్టేషన్లో(Railway Station) అడుక్కు తింటున్న ఓ మహిళను తీసుకువచ్చి పెంచి పెద్దచేసి పెళ్లి చేస్తే యజమానురాలినే అంతం చేసింది. షబ్నం అనే మహిళ 25 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్లో భిక్షాటన(Begging) చేసేది. మేరీ సిలిన్ విల్ఫ్రెడ్ డికోస్టా అనే మహిళ ప్రతిరోజు రైల్వే స్టేషన్ కు వెళ్లేది. అక్కడ వికలాంగురాలైన షబ్నం(shabnam) ను చూసి జాలిపడి ఇంటికి తీసుకొని వచ్చి పని కల్పించింది. 25ఏళ్లుగా సొంత మనిషిలా చూసుకుని పెంచి పెద్దచేసి పెళ్లి చేసింది.
షబ్నం 25 ఏళ్లుగా డికోస్టా ఇంట్లో పనిచేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఒకరోజు తన యజమానురాలి దగ్గర భారీగా డబ్బు(Money) ఉండడం చూసింది. దీంతో ఎలాగైనా దానిని కొట్టేయాలని కుట్ర పన్నింది. ఆ విషయం తన భర్త, కుమారుడితో చెప్పింది. అందుకు తగ్గట్టుగానే గురువారం మధ్యాహ్నం డికోస్తా మనవడు పని నిమిత్తం బయటకు వెళ్లగా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భర్త, కుమారుడి సాయంతో యజమానురాలిని బాత్రూమ్(Bathroom)లోని నీటి బకెట్లో ముంచి చంపేసింది. ఆ తర్వాత డికోస్తా బంగారు గొలుసు, మొబైల్ ఫోన్(Mobile Phone), స్మార్ట్ వాచ్‌తో పరారైంది.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన డికోస్టా మనవడు ఆమెకు ఫోన్ చేస్తున్నాడు. అయితే తన అమ్మమ్మ ఫోన్ ఎత్తకపోవడంతో పక్కింటి వాడిని పిలవమని అడిగాడు. మనమడు ఫోన్ చేసిన సమాచారం(Information) చెప్పేందుకు వెళ్లిన ఇరుగుపొరుగు వారు డికోస్టా ఇంట్లో దృశ్యాన్ని చూసి చలించిపోయారు. వెంటనే జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు(Police) సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు భవనంలోని సీసీటీవీ(CCTV) ఫుటేజీని పరిశీలించగా, షబ్నం, ఆమె కుమారుడు ఇంటి నుంచి బయటకు వెళ్లడం, ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి రావడం కనిపించింది. దీంతో పోలీసులు షబ్నమ్‌ను స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజం బయటకు వచ్చింది. అనంతరం ముగ్గురు నిందితులైన మహ్మద్ ఉమర్ ఇబ్రహీం షేక్, షబ్నమ్ ప్రవీణ్ అలియాస్ మహ్మద్ ఉమర్ షేక్, మహ్మద్ షాజాద్ ఉమర్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.