TPT: సూపర్ GST 2.0 వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నేటి నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. GST 2.0 వలన ఏఏ వస్తువులపై ధరలు తగ్గాయో ప్రతి గడప వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు.