ATP: పామిడి మండలం జి. కొట్టాలకి చెందిన సతీష్ రెడ్డి మృతి కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సాక్ష్యాధారాల సేకరణ, డాగ్ స్క్వాడ్ పరిశీలన, పోస్టుమార్టం నివేదిక, సీసీ ఫుటేజీ ఆధారంగా ట్రాక్టర్ను ఢీకొని సతీశ్ మృతి చెందాడని తేల్చారు. ట్రాక్టర్ డ్రైవర్ సాయికుమార్ నేరం ఒప్పుకున్నాడని, లీగల్ ఒపీనియన్ తీసుకుని చర్యలు తీసుకుంటామని DSP రవిబాబు తెలిపారు.