Elon Musk wants Stephan King, LeBron James to stay on Twitter
Elon Musk:ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) పక్షపాతం చూపించారు. ప్రముఖులు అందరూ బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించాలని చెప్పి మాట తప్పారు. మస్క్ నిర్ణయంతో చాలా మంది ప్రముఖులు బ్లూటిక్ కోల్పోయారు. అమెరికాకు చెందిన ముగ్గురు రచయితలకు మాత్రం ఫ్రీగా బ్లూ టిక్ ఇస్తానని ప్రకటించారు మస్క్(Musk). దీంతో తామేమి తప్పు చేశామని బ్లూ టిక్ కోల్పోయిన ప్రముఖులు అంటున్నారు. ఇండియాలో ప్రముఖ వ్యక్తులు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) బ్లూ టిక్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
అమెరికాకు చెందిన రచయితలు స్టీపెన్ కింగ్ (stephen king), లేబ్రన్ జేమ్స్ (james) రచనలు అంటే మస్క్‌కు అభిమానం. వారిద్దరూ అంటే ఎక్కువ ఇష్టపడతారు. ట్విట్టర్ కొత్త నిర్ణయంతో వీరిద్దరూ కూడా బ్లూ టిక్ కోల్పోయారు. దీనిపై జేమ్స్ (james) ఇటీవల స్పందించారు. బ్లూ టిక్ కోసం తాను డబ్బులు చెల్లించబోనని స్పష్టంచేశారు. దీంతో కొందరు ప్రముఖులకు ఉచితంగానే బ్లూ టిక్ ఇవ్వాలని మస్క్ (Musk) నిర్ణయం తీసుకున్నారు.
జేమ్స్, స్టీపెన్కు బ్లూ టిక్ ఉచితంగానే ఇస్తామని మస్క్ (Musk) చెప్పారు. మరికొందరికీ కూడా అందజేస్తామని చెబుతున్నారు. ఇదే అంశంపై స్టీపెన్ మాట్లాడారు. తాను సబ్ స్క్రైబ్ చేసుకోలేదని వివరించారు. తన ట్విట్టర్ మాత్రం చేసుకున్నట్టు చెబుతుందని తెలిపారు. మొబైల్ నంబర్ ఇచ్చానని చూపిస్తోందని.. నిజానికి ఇవ్వలేదని అంటున్నారు. స్వాగతం.. నమస్తే అని మస్క్ (Musk) రిప్లై ఇచ్చారు.
జేమ్స్‌కు ట్విట్టర్ బ్లూ కంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ఇచ్చామని ట్విట్టర్ ఉద్యోగి ఒకరు వివరించారు. జేమ్స్ కూడా సబ్ స్క్రైబ్ కాలేదు.. మస్క్ (Musk) పర్సనల్‌గా కొందరికీ ఫ్రీగా ఇచ్చారని ట్విట్టర్ వర్గాలు తెలిపాయిని జేమ్స్ మీడియా అడ్వైజర్ అడమ్ మెండెల్సన్ ధృవీకరించారు. స్టీపెన్ కింగ్, విలియం శాట్నార్ కూడా ఫ్రీగా బ్లూ టిక్ పొందారని వివరించారు. మస్క్ (Musk) నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. అందరూ ప్రముఖులు కాకుండా.. ఇద్దరు ముగ్గురు రచయితలకు ఇలా ఫ్రీగా ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు. తాము ఏం చేశామని అంటున్నారు.
ట్విట్టర్ బ్లూ టిక్ అంటే ప్రముఖులకు సంబంధించి ఒరిజినల్ ఖాతాదారులు అని అర్థం. వారి పేరుతో మరొ అకౌంట్ క్రియేట్ చేసిన.. అకౌంట్ ఉంటుందే తప్ప, అదీ ఫేక్ అవుతుంది. అందుకే మస్క్ (Musk) బ్లూ టిక్ కోసం నెలకు 9 డాలర్లు వసూల్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ప్రముఖులు బ్లూ టిక్ (blue tick) కోల్పోయిన సంగతి తెలిసిందే.