PPM: జలవనరుల శాఖ ద్వారా రిపేర్ రెనోవేషన్, రెస్టారేషన్ ఆర్ఆర్ఆర్ క్రింద 56 కోట్లరూపాయల అంచనాతో 102 పనులకు జిల్లా జిల్లా ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి తెలిపారు. భూగర్భ జలాల రీఛార్జ్ ఉద్దేశించిన ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించనున్నాయని కలెక్టర్ తెలిపారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన అభివృద్ది కమిటీ సమావేశం నిర్వహించారు.