AKP: రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 26 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాంగ్ పార్కింగ్, నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.