MLG: BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపలమరి లక్ష్మణ్ బాబు గురువారం జిల్లా కలెక్టర్ దివాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏటూరునాగారంలో 3 డయాసిల్ కేంద్రాలు ఉన్నప్పటికీ, అవి ప్రజలకు సరిపోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరొక డయాసిల్ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరి, వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల BRS నాయకులు ఉన్నారు.