ADB: అన్నదాతలు సీసీఐకి పత్తిని విక్రయించే సమయంలో స్లాట్ బుకింగ్ విధానంతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ అన్నారు. పట్టణంలో దళిత సంఘాల నాయకులతో గురువారం సమావేశమై మాట్లాడారు. జిల్లాలోని రైతులకు ఆన్లైన్ విధానంపై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఈ విధానంపై అవగాహన కల్పించాలని కోరారు.