CTR: చిత్తూరు జిల్లా ప్రధాన కోర్టులో నమోదైన 59 రెవెన్యూ కేసులకు సంబంధించి సకాలంలో స్పందించి కౌంటర్లు దాఖలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ MROలను ఆదేశించారు. గురువారం జిల్లాలో రెవెన్యూ కేసులు పెండింగ్‌కు సంబంధించి DRO మోహన్‌తో కలసి MROలు, MPDOలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన భాధ్యత MROలదే అన్నారు.