E.G: జేసీ వై.మేఘ స్వరూప్ గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి జిల్లా కలెక్టర్‌ను కలిసిన జేసీ ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాను అభివృద్ధి చేయాలన్నారు.