భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్టీ జాబితాలో భద్రాచలం మండలం నుంచి 11 కుటుంబాలకు మంజూరు అయ్యాయని తెలిపారు.