SRCL: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు ఇచ్చారు. గురువారం చందుర్తి మండల కేంద్రం, కట్టలింగంపేట గ్రామాల్లో తుది దశకు చేరుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.