BHPL: కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లో బుధవారం గోదావరి నది వరద భారీగా పెరుగుతోంది. గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉభయ నదులు పొంగి, కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం 7.09 లక్షల క్యూసెక్కుల నీరు 9.81 మీటర్ల ఎత్తున పారుతూ లక్ష్మీ బ్యారేజీ వైపు వెళ్తుంది. బ్యారేజీలో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.