షిర్డీ ఆలయానికి (Shirdi temple) చెందిన శ్రీ సాయిబాబా సంస్దాన్ టస్ట్ర్, RBI ని ఆశ్రయించింది. బ్యాంకులు నాణేలు స్వీకరించలేదని ట్రస్ట్ RBI కి లేఖ రాసింది
షిర్డీ ఆలయానికి చెందిన శ్రీ సాయిబాబా (Sri Sai Baba) సంస్దాన్ టస్ట్ర్కి కొత్త సమస్య వచ్చింది .సాధారణంగా బ్యాంకులు లక్షలాది రూపాయల డిపాజిట్ అంటే కళ్లకద్దుకుని తీసుకుంటాయి. అది కూడా దేవాలయాలు, దేవస్దానాలకు చెందినవయితే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కాని షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్దాన్ ట్రస్ట్(Sansdan Trust) ఇస్తున్న డబ్బును మాత్రం డిపాజిట్(Deposit) చేసుకోవడానికి బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. కారణమేమిటంటే ఇవి నాణేల రూపంలో ఉండటమే. తమ బ్యాంకు స్దల సమస్య కారణంగా తాము వీటిని తీసుకోలేమని అవి తెలిపాయి. శ్రీసాయిబాబా ట్రస్ట్ కి 13 ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. షిర్డీలోనే 12 ఖాతాలుండగా.. నాసిక్ (Nashik) లో ఒకటి ఉంది. అయితే వీటిలో నాలుగు బ్యాంకులు ఇప్పుడు నాణాలు స్వీకరించడానికి నిరాకరిస్తున్నాయి. స్థలాభావం కారణంగా విరాళాలుగా వచ్చిన నాణాలు స్వీకరించలేమని తెలిపాయి. కాగా షిర్డీ సాయిబాబా ట్రస్ట్ కు నాణాల రూపంలో లక్షల రూపాయలు విరాళాలుగా అందుతున్నాయి.
ఇప్పటికే పలు బ్యాంకుల్లో 11 కోట్ల రూపాయల మేరకు నాణాల రూపంలో డిపాజిట్లు (Deposits) ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆలయానికి సంబంధించి నాణాల రూపంలోనే ఎక్కువగా విరాళాలు వస్తున్నందున జోక్యం చేసుకోవాల్సిందిగా ట్రస్ట్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (RBI) లేఖ రాసింది. ఈ విషయాన్ని ట్రస్ట్ సీఈవో రాహుల్ జాదవ్ (CEO Rahul Jadhav) వెల్లడించారు. ట్రస్ట్‌కు నాణేల రూపంలో లక్షల రూపాయల విరాళాలు అందుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం ట్రస్ట్ నాణేల రూపంలో వివిధ బ్యాంకుల్లో 11 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసింది .ఆలయం విరాళాలలో ఎక్కువ మొత్తం నాణేలలో ఉన్నందున జోక్యం చేసుకోవాలని కోరుతూ ట్రస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.ఆలయానికి ఒక వారంలో సుమారు రూ.7 లక్షల విలువైన నాణేలు(Coins) ఒక సంవత్సరంలో రూ.3.5 కోట్ల విలువైన నాణేలు విరాళాలుగా వస్తాయి. విరాళంగా ఇచ్చిన డబ్బు లెక్కింపు వారానికి రెండుసార్లు జరుగుతుంది.