SRPT: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. 3,74,746 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. అధికారులు ప్రాజెక్టు 12 గేట్లను నాలుగు మీటర్ల మేరకు ఎత్తి 3,82,397 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణ వైపు ఉన్న విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.