MBNR: జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతంలో వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్లో రికార్డు స్థాయిలో 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌకుంట్ల 90.0, హన్వాడ 81.8, దేవరకద్ర 85.0, కొత్త ముల్గర 70.3 మి.మీ, అడ్డాకుల 58.8 మి.మీ, జానంపేట 58.5, మహబూబ్ నగర్ 51.5, జడ్చర్ల 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.