VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామంలో ఆయిల్ పామ్ పంటలపై ఉద్యాన శాఖ అధికారిణి పి.పద్మ రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆయిల్ పామ్‌పై సాగు విధానం, తద్వారా కలిగే ప్రయోజనాలపై రైతులకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై రైతులకు చెప్పారు. పంట కోతకు వచ్చిన తరువాత గెలలు కోసుకొనే రైతులకు 50 శాతం ఇవ్వడం జరుగుతుందన్నారు.