VSP: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకురాలు శోభ హైమావతి డిమాండ్ చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా మహిళా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.