BDK: భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రామాలయంలో దసరా మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాగా ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.