ప్రధాని మోదీపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. ‘మేరా దేశ్ పహ్లే: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్రమోదీ’ ప్రీమియర్లో పాల్గొన్న జాన్వీ.. మోదీ చేసే ప్రతి పని స్ఫూర్తిదాయకమంటూ కొనియాడారు. దేశంలోని వారందరికీ మోదీ కథ గురించి తెలుసని, ఆయన జీవితం, ఆయన దేశం కోసం తీసుకునే నిర్ణయాలు అన్నీ ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు.