KNR: ఈనెల 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు జిల్లాలో చేపట్టనున్న “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమ నిర్వహణకు జిల్లాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు.