ఓ ఆవు ఆర్గానిక్ రెస్టారెంట్(Organic Restaurant)ను ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. సాధారణంగా చాలా మంది తమ రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి సెలబ్రిటీ(Celebrities)లను, లేకుంటే ముఖ్య అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆవు(Cow)ను అతిథి(Gest)గా ఆహ్వానించి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతోంది.
ఆర్గానిక్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఆవు వీడియో:
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ రెస్టారెంట్(Restaurant) మొదలైంది. ఈ రెస్టారెంట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇదే నగరంలో ఏర్పాటైన మొట్టమొదటి ఆర్గానిక్ రెస్టారెంట్(Organic Restaurant). దానికి ఆర్గానిక్ ఒయాసిస్(Organic Oasis) అనే పేరు పెట్టారు. ఇందులో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే కస్టమర్లకు ఇవ్వనున్నారు.
ఈ ఆర్గానిక్ రెస్టారెంట్(Organic Restaurant) ప్రారంభానికి యాజమాన్యం ఆవు(Cow)ను ముఖ్య అతిథి(Gest)గా ఆహ్వానించింది. మాజీ డిప్యూటీ ఎస్పీ శైలేంద్ర సింగ్ ఈ ఆర్గానిక్ రెస్టారెంట్ యజమాని కావడం గమనార్హం. దేశం వ్యవసాయం(Agriculture), ఆవుల మీద ఆధారపడి ఉందని, అందుకే తాను ఆర్గానిక్ ఒయాసిస్(Organic Oasis)ను స్థాపించినట్లు తెలిపారు. తన రెస్టారెంట్ కు గౌరవ అతిథిగా గోమాతను ఎంచుకున్నానన్నారు. కల్తీ లేని పదార్థాలకు తాము వ్యతిరేకమన్నారు. అందరికీ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పదార్థాలతోనే తమ రెస్టారెంట్ లో వంటకాలు అందుతాయన్నారు. ప్రస్తుతం గోమాత రెస్టారెంట్ ను ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.